Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు.

New Update
bandi-sanjay counter

bandi-sanjay counter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది..  అహ్మదాబాద్‌ ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.   తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పగటి కలలు మానుకోవాలని..  సీఎం సొంత జిల్లా, సిట్టింగ్‌ సీట్‌లో గెలిచామన్నారు సంజయ్.  కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి అంటూ  సంజయ్ కామెంట్స్ చేశారు.  

కామారెడ్డిలో ఓడిపోయి మూడో స్థానం

గడిచిన పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకతను మూటగట్టుకుందో..కేవలం 15 నెలల కాంగ్రెస్ పాలన అంతకు రెట్టింపు వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌‌నగర్‌‌లోనే కాంగ్రెస్‌‌ను గెలిపించలేకపోయారని, సిట్టింగ్ సీటైన మల్కాజ్‌‌గిరి స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారని సంజయ్ ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయారని  గుర్తుచేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకీ అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. బీజేపీని అడ్డుకోవడం అనేది ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని బండి సంజయ్ అన్నారు.  

Advertisment
తాజా కథనాలు