/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Chidambaram-jpg.webp)
P. Chidambaram
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.
ఏమవ్వలేదు...బావున్నారు..
ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. స్థానిక జైడస్ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.
Because of extreme heat, I suffered dehydration.
— P. Chidambaram (@PChidambaram_IN) April 8, 2025
All tests are normal. I am perfectly well now.
Thank you, all 🙏
today-latest-news-in-telugu | p-chidambaram | congress | health
Also read : Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్