BJP: జాతీయ పార్టీలకు విరాళాలు.. బీజేపీకే అత్యధిక ఫండ్స్‌

అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తెలిపింది. ఈ పార్టీకి రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.

New Update
BJP tops list of national parties in Donations

BJP tops list of national parties in Donations

అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) కీలక విషయాన్ని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తమ నివేదికలో తెలిపింది. ఈ పార్టీకి మొత్తం రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.  

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 12,547 కోట్లుగా ఉంది. ఈ ఏడాది వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క బీజేపీయే 88 శాతం వాటా దక్కించుకుంది. ఈ విరాళాల్లో 211 శాతం పెరుగుద కనిపించింది. బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నిలిచింది. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువగా విరాళాలు వచ్చాయి. తమకు రూ.20 వేలకు మించి విరాళాలు రాలేదని బీఎస్పీ మరోసారి చెప్పింది. 2022-2023 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023-24లో జాతీయ పార్టీలకు 199 శాతం పెరిగింది. 2023-24లో జాతీయ పార్టీలకు  వచ్చిన మొత్తం విరాళాల్లో 88 శాతం బీజేపీ ఖాతాలోకే చేరాయి. 

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!

rtv-news | bjp | congress | party-funds

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు