Shyam Pitroda: పాకిస్తాన్ నా సొంతఇల్లులా అనిపిస్తోందన్న కాంగ్రెస్ నేత
భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ విదేశాంగ విధానం మారాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన సూచించారు. పాకిస్థాన్ సందర్శించిన ప్రతిసారి తనకు సొంత ఇంట్లో ఉన్నట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు.