Warangal: కాంగ్రెస్‌ నేత లైంగిక వేధింపులు..పురుగుల మందు తాగిన ప్రభుత్వ ఉద్యోగిని..

అధికార పార్టీ నాయకుడి  లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక  ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది.  అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.

New Update
sucide attemt

sucide attemt

Warangal:  అధికార పార్టీ నాయకుడి  లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక  ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది.  అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది. కాగా ఘటనకు సంబంధించి బాధిత మహిళ సూసైడ్‌ నోట్‌ రాసింది.  వివరాల ప్రకారం..నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో వాంకుడోత్‌ కల్పన అనే మహిళ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది.  కల్పనను మండలంలోని బిల్యానాయక్‌తండాకు చెందిన మాలోత్‌ చరణ్‌సింగ్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తనకు లొంగక పోవడంతో తనపై  కలెక్టర్‌కు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశాడని తెలిపింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని మాజీ ఎంపీటీసీ మాలోత్‌ మోహన్‌ మొబైల్‌ నుంచి చరణ్‌సింగ్‌ తన మొబైల్‌కు వాట్సాప్‌ చేయించాడని వెల్లడించింది.

Also Read: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం..  భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య

దీనిపై తహసీల్దార్‌ ముప్పు కృష్ణను  కల్పన సోమవారం కార్యాలయంలో సంప్రదించింది.. అయితే ఆయన చరణ్‌సింగ్‌తో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్యాలయంలోనే పురుగుల మందు తాగానని వివరించింది. దీనిపై విచారణ జరిపి చరణ్‌సింగ్‌, తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా పురుగుల మందు తాగిన కల్పనను గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను తహసీల్దార్‌ కారులో నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అచితే అంతకు ముందే రాసిన సూసైడ్‌ నోట్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  

Also Read: నేపాల్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం ఎత్తివేత

 కాగా ఓ భూమి విషయంలో గిర్దావరితోపాటు తనను చంపుతామని మాజీ ఎంపీటీసీ మాలోత్‌ మోహన్‌ ఇటీవల బెదిరించినట్టు ఆమె ఆరోపించింది.  వీటన్నింటికీ ప్రధాన కారణం తహసీల్దార్‌ కృష్ణ అని తన సూసైడ్‌ నోట్‌లో తెలిపింది. కాగా కల్పన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. తాను చనిపోతే తన పిల్లల భవిష్యత్తును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూసుకోవాలని ఆమె తన సూసైడ్‌ నోట్‌లో వేడుకున్నది. తనకు ఈ పరిస్థితిని కల్పించిన అధికారితోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకొని తన కుటుంబానికి న్యాయం చేయాలని నోట్‌లో పేర్కొంది. అంతేకాక తన భర్త డిప్యూటీ తహసీల్దార్‌ రాజేష్‌ఖన్నా మృతి వెనుక కూడా తహసీల్దార్‌ హస్తం ఉన్నదని ఆమె ఆరోపించారు. తహసీల్దార్‌ మానసికంగా వేధించాడని. అంతేకాక కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు తీవ్రంగా మందలించడంతో తన భర్త మనోవేదనతో దవాఖానపాలై ఇటీవల మృతిచెందినట్టు ఆమె తెలిపారు.

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

Advertisment
తాజా కథనాలు