/rtv/media/media_files/2024/11/02/YDsQNJHdJVlHb6R7nhXl.jpg)
Congress Leader Rape: నల్లగొండ జిల్లాలో ఎస్టీ మహిళపై రేప్ సంచలనం రేపుతోంది. మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఇంట్లోకి కాంగ్రెస్ నేత దూరాడు. ఒంటరిగా ఉన్న మహిళపై కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య అత్యాచారం చేశాడు. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 21వ తేదీన మహిళపై రేప్ జరగగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి దూరి అరిస్తే చంపేస్తానని కాంగ్రెస్ నేత మహిళను బెదిరించాడు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
ఆత్మహత్య ప్రయత్నం...
అదే రోజు బాధిత మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆ మహిళకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం బయటకు రాకుండా కాంగ్రెస్ బడా నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణయ్యను కాపాడేందుకు కాంగ్రెస్ పెద్దల రాజీ యత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా బాధిత మహిళకు పోలీసులు అండగా ఉండి న్యాయం చేస్తారా? లేదా రాజకీయ నేతలకు కాపు కాస్తారా అనేది వేచి చూడాలి.
Also Read: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!