/rtv/media/media_files/2025/04/25/MdzEBywh5X0FbOGHsUGB.jpg)
suprmee-court rahul gandhi
స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ పరువు నష్టం కేసులో తనపై జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022, నవంబరు 17న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ ను 'బ్రిటిష్ ఏజెంట్'గా రాహుల్ అభివర్ణించారు.
Also Read : కండెక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!
These Milords of Supreme Court felt offended when @nishikant_dubey ji said that they practice the policy of "you show me the face and I will show you the law" but they do it again and again.
— Amitabh Poddar (@AmitabhPoddar1) April 25, 2025
Why let go Rahul Gandhi with a warning? What is so special about him ?
All equal ?? https://t.co/y1PgnrcDnF
Also Read : Fake 500 Note: ఫేక్ రూ.500 నోట్లను గుర్తించే గుర్తులు ఇవే.. అస్సలు మోసపోకండి!
రిపీటైతే తీవ్ర చర్యలు
ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. స్వాతంత్య్ర సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చిచెప్పింది. ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఒక న్యాయవాది చేసిన ఫిర్యాదుపై లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయడానికి నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి రాహుల్ గాంధీ శుక్రవారం కశ్మీర్ చేరుకున్నారు. ఈ దాడిలో 26 మంది మరణించారు.
Also Read : హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్
supreme-court | congress-leader | Savarkar defamation case