/rtv/media/media_files/2025/04/08/qpJYKreafA3AWpGrTIT4.jpg)
P. chidambaram
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.
#WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25
— ANI (@ANI) April 8, 2025
హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి.