Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన మైత్రీ మేకర్స్ సినిమాలు.. ఏకంగా అన్ని సినిమాలకు అవార్డు !
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు అవార్డుల పంట పండింది. ఈ సంస్థ నిర్మించిన నాలుగు సినిమాలకు గద్దర్ అవార్డు వరించింది. 2015 ఉత్తమ చిత్రం విభాగంలో శ్రీమంతుడు, 2016లో జనతా గ్యారేజ్, 2018లో రంగస్థలం, 2021లో ఉప్పెన చిత్రాలు అవార్డు గెలుచుకున్నాయి.