Ileana D'Cruz: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

నటి ఇలియానా రెండో సారి తల్లి కాబోతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్రెండ్ కలిసి షేర్ చేసిన ఫొటోలో బేబీ బంప్ తో కనిపించింది. ఈ ఫొటోలో తాను, తన ఫ్రెండ్ ఇద్దరు బేబీ బంప్స్ తో ఫొటోకు ఫోజులిచ్చారు.

New Update
Ileana D'Cruz baby bump

Ileana D'Cruz baby bump

Ileana D'Cruz: స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ త్వరలోనే తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజాగా తన బేబీ బంప్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఆమెతో పాటు గర్భవతిగా తన స్నేహితురాలితో కలిసి బేబీ బంప్ ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోను షేర్ చేస్తూ  'బేబీ బంప్ బడ్డీస్' అని రాసుకొచ్చింది ఇలియానా. అయితే ఇలియానా జనవరిలోనే 'న్యూ ఇయర్ వీడియో'తో తన సెకండ్ ప్రెగ్నెన్సీ పై హింట్ ఇచ్చారు. ఇప్పుడు బేబీ బంప్ ఫొటోను షేర్ చేస్తూ కన్ఫర్మ్  చేశారు. 

Also Read :  కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

2023లో మైకేల్ డోలన్‌ తో వివాహం 

ఇలియానా 2023 మేలో మైకేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరవాత అదే ఏడాది ఆగస్టులో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. తరచూ ఇలియానా తన బాబుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. 

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

ఇక ఇలియానా సినిమాల విషయానికి వస్తే .. 2006లో తెలుగు సినిమా 'దేవదాసు' తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘పోకిరి,’ ‘జల్సా,’ ‘కిక్,’ ‘జులాయి’ వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లోనూ సత్తా చాటింది. హిందీలో  బర్ఫీ, రుస్తం, రైడ్, మేన్ తేరా హీరో లాంటి హిట్స్ ఇచ్చింది. 2021 తర్వాత దాదాపు 3 సంవత్సరాలు సినిమాలకు దూరమైనా ఈ బ్యూటీ 2024లో  'దో ఔర్ దో ప్యార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలియానా సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ వెకేషన్, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను పంచుకుంటుంది. 

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

 

ileana-dcruz | Latest News | cinema-news | telugu-news

#telugu-news #cinema-news #Latest News #ileana-dcruz
Advertisment
Advertisment
తాజా కథనాలు