Rakul Preeth: కోహ్లీ ఒక్క లైక్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు! అవనీత్ కౌర్ వివాదంపై రకుల్ హాట్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఒక్క లైక్ తో నటి అవనీత్ కౌర్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు పెరగడంపై హీరోయిన్ రకుల్ స్పందించారు. మనం ఎంత ఖాళీగా ఉన్నామో.. దీని బట్టే అర్థమవుతుంది. ఎంతో విలువైన సమయాన్ని సోషల్ మీడియాలో వెస్ట్ చేస్తున్నాము.. ఇది అనవరసరం అని స్పష్టం చేశారు.

New Update
rakul on virat like controversy

rakul on virat like controversy

Rakul Preeth:  ఇటీవలే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) నటి అవనీత్ కౌర్ (avneet kaur) ఫ్యాన్ పేజ్ ని లైక్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క లైక్ తో నటి అవనీత్ కౌర్ కి ఇన్ స్టాగ్రామ్ లో (instagram) 2 మిలియన్ల ఫాలోవర్లు (followers) పెరగడం గమనార్హం.  అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రకుల్ (rakul Preeth singh) దీనిపై స్పందించారు. మనం ఎంత ఖాళీగా ఉన్నామో దీని బట్టే అర్థమవుతుంది అంటూ గడ్డిపెట్టారు. 

Also Read: Ileana D'Cruz: రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

ఇది అనవసరం.. 

రకుల్  మాట్లాడుతూ.. ఇది చాలా బాధ కలిగించే విషయం. మనమంతా ఎంత ఖాళీగా ఉన్నామో దీని బట్టే అర్థమవుతుంది!  అతడి ఒక్క లైక్ కి ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడా? పొరపాటున జరిగిందా? అని కూడా ఆలోచించలేదు. కొన్ని సార్లు పొరపాటున ఫ్రెండ్స్ ని కూడా అన్ ఫాలో చేస్తుంటాము. కానీ కోహ్లీ సెలెబ్రెటీ కావడం వల్ల అతడి లైక్ ఒక వార్త అయిపోతుంది. ఇది చాలా విచారకరం! దీనిపై కోహ్లీ వివరణ కూడా ఇచ్చారు. ప్రజలు సెలెబ్రెటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. చాలా సమయాన్ని సోషల్ మీడియాలో(social media) వృధా చేస్తున్నారు.. ఇది అనవసరం అని స్పష్టం చేశారు. 

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

rakul in red
rakul in red

 ఇదిలా ఉంటే ఈ లైక్ వివాదంపై ఇప్పటికే కోహ్లీ వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఇన్ స్టాగ్రామ్ అల్గోరిథం వల్ల  జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ దీని గురించి ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు