Miss World 2025: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 40 మంది క్వార్టర్‌ ఫైనలిస్టులు తుది పోటీలకు సిద్ధంగా ఉన్నారు. 31వ తేదీన హైదరాబాద్ HITEXలో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌కి 3,500 మంది అతిథులు హాజరవుతారు. ఈమేరకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

author-image
By Archana
New Update
miss world 2025 finals count down

miss world 2025 finals count down

Miss World 2025: అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్స్ కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఫైనల్స్ కి చేరిన అందాల భామలు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడనున్నారు. మొత్తం  40 మందిని క్వార్టర్‌ ఫైనలిస్టులు తుది పోటీలకు సిద్ధమవుతున్నారు.  అందులో ఇప్పటికే  14 మంది వివిధ రౌండ్స్ లో తమ ప్రతిభతో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. 

స్పోర్ట్స్ ఛాలెంజ్,  టాలెంట్ ఛాలెంజ్ నుంచి ఒక్కొక్కరు, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ నుంచి నలుగురు, టాప్ మోడల్ పోటీ నుంచి నలుగురు,  బ్యూటీ విత్ ఎ పర్పస్ కేటగిరీ నుంచి నలుగురు ఇలా మొత్తం 14 మంది విజేతలు క్వార్టర్ ఫైనల్స్ కు వేగంగా చేరుకున్నారు. ఇందులో అమెరికాస్-కరిబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఒషేనియా వంటి ఖండాల ప్రతినిధులు ఉన్నారు. మిగతా 26 మంది కంటెస్టెంట్లను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ 40 మంది ఫైనల్స్ లో పోటీ పడతారు. 

Also Read :  Jubilee Hills Pub: జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

పోటీ ఎలా జరుగుతుంది.. 

  • ముందుగా ప్రతి ఖండం నుంచి 10 మందితో టాప్ 40 మందిని సెలెక్ట్ చేస్తారు. 
  • అనంతరం టాప్ 20 – ఒక్కో ఖండం నుంచి 5 మంది సెలెక్ట్ అవుతారు. 
  • ఆ తరువాత టాప్ 8 – ఒక్కో ఖండం నుంచి  ఇద్దరు  ఎంపిక అవుతారు. 
  • చివరగా ఫైనల్ కి 4 – ఒక్కో ఖండానికి ఒక విజేతను ఎంపిక చేస్తారు. 

ఈ నలుగురిలో ఒకరికి మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుంది. మిగిలిన ముగ్గురు  రన్నరప్ గా నిలుస్తారు. 

Also Read :  సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా

Also Read :  ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

రేపే ఫైనల్స్ 

మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ హైదరాబాద్ HITEXలో కొత్తగా నిర్మించిన హాల్ 4లో  31వ తేదీన జరుగుతాయి.  రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఫైనల్ పోటీలు కొనసాగుతాయి.

ఈ ఈవెంట్ లో సుమారు 3,500 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సైబర్ పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, టూరిజం విభాగం, ఈవెంట్ నిర్వాహకులు కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 

Also Read :  టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు

 

telugu-news | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు