The Traitors: కరణ్ జోహార్ కొత్త రియాలిటీ షో.. వెక్కి వెక్కి ఏడుస్తున్న మంచు లక్ష్మీ ! ఫుల్ థ్రిల్లింగ్ గా ట్రైలర్

కరణ్ జోహార్ సరికొత్త రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ది ట్రైటర్స్’ అనే పేరుతో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఫుల్ థ్రిల్లింగ్ గా కనిపించింది. నటి మంచు లక్ష్మీ కూడా షోలో పాల్గొంటున్నారు. జూన్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

New Update

The Traitors Trailer:  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ ( karan-johar) ‘ది ట్రైటర్స్' అంటూ  మరో కొత్త రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈషాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఫుల్ విజువల్ గ్రాండియర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ షోలో 20 మంది సెలెబ్రిటీస్ పాల్గొంటారు. రాజస్థాన్‌లోని రాయల్ తెలుగు కోటను తలపించే సూర్యగఢ్ ప్యాలెస్ లో ఈ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. 

Also Read : Jubilee Hills Pub: జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

షో ఫార్మాట్ 

ఈ షోలో ‘ట్రైటర్స్’ (ద్రోహులు) అని పిలవబడే కొందరిని కరణ్ జోహర్ రహస్యంగా ఎంపిక చేస్తారు. మిగతా కంటెస్టెంట్లు ద్రోహులు ఎవరో కనుక్కోవాలి. కనుక్కోలేకపోతే వారు ఆట నుంచి ఎలిమినేట్ అంటే  (హత్య చేయబడినట్టు) అర్థం. కరణ్ కుండ్రా,  రాజ్ కుంద్రా, రాఫ్తార్,  జాస్మిన్ భాసిన్,  జన్నత్ జుబైర్, ఊర్ఫీ జావేద్,  మాహీప్ కపూర్,  తదితరులు పాల్గొంటున్నారు. 

రియాలిటీ షోలో మంచు లక్ష్మీ ఎంట్రీ 

ఈ రియాలిటీ షోలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. ప్రోమోలో ఆమె గేమ్ చాలా కష్టంగా ఉంది.. అంటూ వెక్కి వెక్కి ఏడవడం కనిపించింది. మరి ఆమె గేమ్ లో ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. ‘ది ట్రైటర్స్’ (The Traitors) అనేది మామూలు రియాలిటీ షో (tv-reality-shows) కాదు. ఇది మైండ్ గేమ్, ద్రోహం, డ్రామాతో నిండి ఉంటుంది.   ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టేలా షోను ప్లాన్ చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు అమెజాన్ ప్రైమ్లో షో ప్రసారం అవుతుంది.

Also Read : ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

Advertisment
తాజా కథనాలు