Pawan Kalyan: డబ్బింగ్ చెప్పడంలో పవర్ స్టార్ కొత్త రికార్డ్.. ఫ్యాన్స్ ప్రశంసల వెల్లువ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం నాలుగు గంటల్లోనే సినిమా మొత్తం డబ్బింగ్ పూర్తి చేశారు. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీర మల్లు’ జూన్ 12న విడుదల కానుంది.

New Update

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓ వైపు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు తాను ఇప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి తీరక లేకుండా శ్రమిస్తున్నారు. తాజాగా  హరిహరవీరమల్లు సినిమాకు సంబంధించిన  డబ్బింగ్ ఒక్క రాత్రిలో, కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు.

నాలుగు  గంటల్లో

 రాత్రి 10 గంటల వరకు 'ఓజీ'  షూటింగ్ ముగించుకొని.. ఆ తర్వాత మళ్ళీ హరిహరవీరమల్లు డబ్బింగ్ కోసం స్థూడియోకు వెళ్లారట. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా పట్ల ఆయన కమిట్మెంట్, డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. కేవలం నాలుగు గంటల్లో సినిమా మొత్తం డబ్బింగ్ పూర్తి చేయడం పవన్ కొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీర మల్లు’ జూన్ 12న విడుదల కానుంది. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. 

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. థియేటర్ విడుదల తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా పూర్తిగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పరంగా భారీ స్థాయిలో తెరకెక్కించారు. గ్రాండ్ సింమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి డిజైన్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Also Read : Jubilee Hills Pub: జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

Advertisment
తాజా కథనాలు