Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!
మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీలో.. పోలీసులు పెద్ద మొత్తంలో ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన ఈ పార్టీలో.. పోలీసులు పెద్ద మొత్తంలో ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమీర్ ఖాన్ లేటెస్ట్ సూపర్ హిట్ సీక్వెల్ 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని సమాచారం.
మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈనెల 13న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది.
నటి మెహరీన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. క్రొయేషియా ఐలాండ్ దీవుల్లో చిల్ అవుతుంది. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలను మెహరీన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
రణబీర్ కపూర్ ముంబై బాంద్రాలోని తన కొత్త ఇంటిని కూతురు రాహా పేరు మీద రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆరంతస్థుల భవనం ప్రస్తుతం రూ.250 కోట్లు విలువ చేస్తుందని టాక్. మరో 2, 3నెలల్లో రణబీర్ దంపతులు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారని సమాచారం.
టాలీవుడ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. యూట్యూబ్ లో ఓ ఫన్నీ వీడియో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఇది మీరూ కూడా చూడండి.
సీనియర్ నటి ఆమని ఇటీవలే ఇంటర్వ్యూలో తన వీక్ నెస్ గురించి ఓపెనప్ అయ్యారు. ప్రతిరోజు పూజ చేయకుండా తాను ఉండలేనని.. అలా చేయకపోతే ఆరోజంతా తన మనసు మనసు కలవరం చెందినట్టుగా ఉంటుందని చెప్పారు. ఈ అలవాటు తనకు ఒక వీక్ నెస్ గా మారిపోయిందని తెలిపారు.
ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కామెడీ చిత్రాలతో పాటు హారర్ సినిమాలు కూడా వినోదాన్ని పంచేందుకు వచ్చేశాయి. సింగిల్, దేవిక &డానీ , రామానాయుడు, ఎలెవన్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.