Thammudu Trailer: నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్మెంట్ వీడియోలో హీరోయిన్ల అల్లరి!

టాలీవుడ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. యూట్యూబ్ లో ఓ ఫన్నీ వీడియో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఇది మీరూ కూడా చూడండి.

New Update

Thammudut Trailer: ఈ మధ్య డైరెక్టర్లు, హీరోలు  తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. తాజాగా నితిన్ 'తమ్ముడు' మూవీ టీమ్ తమదైన స్టైల్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఫీమేల్ లీడ్స్ లయ, వర్షా బొల్లమ్మ, లుబ్బర్ పందు ఫేమ్ స్వాసిక ఫన్నీ చిట్ చాట్ తో విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: Jamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Also Read :  రిలేషన్ షిప్‌ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..

దిల్ రాజు  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  "వకీల్ సాబ్", "మా" వంటి సూపర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో  'కాంతారా' ఫేమ్   సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, లుబ్బర్ పందు ఫేమ్ స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్  కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

జులై 4న విడుదల

ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన రాబిన్హుడ్ ప్లాప్ అవడంతో.. తమ్ముడు విజయం నితిన్ కెరీర్ కి కీలకంగా ఉండబోతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. 

Also Read: Mahesh Babu T-Shirt: వామ్మో! ఒక్క టీ- షర్ట్ ధర అన్ని లక్షలా.. అక్కినేని రిషెప్షన్ లో మహేష్ లుక్ వైరల్

 

cinema-news | Nithiin Thammudu Movie | Thammudu movie trailer

Advertisment
Advertisment
తాజా కథనాలు