Ram charan- Trivikram: ఫ్యాన్స్ కి పండగే.. చరణ్- త్రివిక్రమ్ కాంబోలో అదిరిపోయే సినిమా !

రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఉండబోతుందని సమాచారం.

New Update

Ram charan- Trivikram:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' తర్వాత సుకుమార్ తో RC17 ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. ఈలోగ చరణ్ కోసం మరో కథ సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- చరణ్ కాంబోలో  రాబోతుందనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. అయితే వాస్తవానికి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. కానీ,  కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఇప్పుడు చరణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా సమాచారం.

Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?

కామెడీ యాక్షన్ థ్రిల్లర్

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే ఈ సినిమా సినిమా కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో కూడి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అయితే వచ్చేఏడాది చరణ్.. సుకుమార్ RC17 తో పాటు త్రివిక్రమ్ షూటింగ్ కూడా పారలెల్ గా చేయనున్నారని సమాచారం. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్ తో ఓ సినిమా పూర్తి చేయనున్నట్లు సమాచారం.

Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు