Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చుట్టూ వివాదాలు నెలకొన్నప్పటికీ.. సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు తాజాగా మూవీ ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ నెల 13న ట్రైలర్ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
13th June!#kannappa #harharmahadevॐ pic.twitter.com/BHcUzqIZZu
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2025
స్టార్ కాస్ట్
ఇదిలా ఉంటే ఇప్పటికే మంచు విష్ణు మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవలే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి స్టార్ స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరెక్కిన ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్, అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈమూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాంట్రవర్సీ
అయితే 'కన్నప్ప' సినిమాలో పిలక, గిలక పాత్రలపై వివాదం చెలరేగింది. ఈ పాత్రలు బ్రాహ్మణులను అవహేళన చేసేలా ఉన్నాయని బాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. పిలక, గిలక పాత్రలతో మంచు కుటుంబం.. బ్రాహ్మణ సంస్కృతి, సంప్రదాయాలను అవమానిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సినిమా నుంచి ఈ పాత్రలు తొలగించకపోతే మూవీ విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికి తోడు సినిమాలోని ముఖ్యమైన వీఎఫెక్స్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనం జరగడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: Shalini Pandey: ఉఫ్.. తడిసిన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ