Actress Amani: సీనియర్ నటి ఆమని ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగతానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమని తన వీక్ నెస్ గురించి బయటపెట్టారు. రోజూ ఆ పని చేయకపోతే తాను ఉండలేనని ఓ సీక్రెట్ రివీల్ చేశారు.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్
అదే నా వీక్ నెస్
అయితే ప్రతిరోజు పూజ చేయకుండా తాను ఎక్కడికీ వెళ్ళలేనని.. అలా వెళితే రోజంతా మనసు కలవరం చెందినట్టుగా ఉంటుందని చెప్పారు. ఉదయం నాలుగంటలే నిద్రలేవగానే.. వెంటనే స్నానం చేసి పూజ చేయడం తన మొదటి పని అని తెలిపారు. అంతేకాదు రోజూ ఉదయాన్నే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం తన డైలీ రొటీన్ అని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T125904.554-jpg.webp)
ఇక ఆమని సినిమాల విషయానికి వస్తే.. వివాహం తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలతో అలరించడంతో పాటు సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ మాటీవీ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' అనే సీరియల్ చేస్తున్నారు. ఇందులో ఆమని 'వేదవతి' పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read: Jamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్