/rtv/media/media_files/2025/06/11/AgF2lJYryHCQS217Cw5s.jpg)
drugs at folk singer mangli birthday party
Singer Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో భారీగా ఫారిన్ మద్యం పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే జూన్ 10న సింగర్ మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో పార్టీ నిర్వహించింది.
9 మందికి గంజాయికి పాజిటివ్
ఈ పార్టీకి ఆమె కుటుంబ సభ్యులు, సినీ సెలెబ్రెటీలతో కలిపి మొత్తం 45 మంది హాజరయ్యారు. ఈ పార్టీకి అనుమతులు లేవన్న సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్ పై దాడులు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఫారిన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీకి హాజరైన వారికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరు గంజాయి తీసుకున్నట్లు తేలిందని సమాచారం. సింగర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో.. మంగ్లీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తెలంగాణ యాస, భాషతో ప్రజలను ఆకట్టుకుంది. అలా తనకున్న టాలెంట్ తో మ్యూజిక్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన మంగ్లీ.. రేలారే.. రేలారే పాటతో ఒక్కసారిగా పాపులరైంది. ఆ తరువాత బతుకమ్మ, బోనాలు నేపథ్యంలో వచ్చిన తెలంగాణ పాటలతో మంచి ఆదరణ పొందింది. అదే క్రేజ్ తో సినిమాల్లో కూడా పాడే అవకాశం దక్కించుకుంది.
అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ' రాములో.. రాములో' పాటతో మంగ్లీ సింగింగ్ కెరీర్ మరింత ఊపందుకుంది. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ' రాములో.. రాములో' పాటతో మంగ్లీ సింగింగ్ కెరీర్ మరింత ఊపందుకుంది. అప్పటి నుంచి వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది మంగ్లీ.
Also Read: Sitaare Zameen Par: ఫుల్ ఎంటర్ టైనింగ్ గా 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్.. మీరు చూశారా?