OTT MOVIES: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కామెడీ చిత్రాలతో పాటు హారర్ సినిమాలు కూడా వినోదాన్ని పంచేందుకు వచ్చేశాయి. సింగిల్, దేవిక &డానీ , రామానాయుడు, ఎలెవన్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ వారం ఓటీటీ వినోదం
రానా నాయుడు
వెంకటేష్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'రానా నాయుడు' సీజన్ 2 జూన్ 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1 సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో.. 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేవిక & డానీ
రీతూ వర్మ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ దేవిక &డానీ. ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహించారు.
భూల్ చుక్ మాఫ్
రాజ్ కుమార్ రావు, వామికా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'భూల్ చుక్ మాఫ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 23న థియేటర్స్ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
పెళ్లికాని ప్రసాద్
సప్తగిరి, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'పెళ్లికాని ప్రసాద్ ' చిత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓ యువకుడి ప్రేమ కథ
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'ఓ యువకుడి ప్రేమకథ' 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. బీసీ నౌఫుల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త మేనన్ ఫీమేల్ లీడ్ గా నటించింది.
లెవెన్
నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవెన్' ఈనెల 13 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. లోకేష్ అజిల్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రియా హరి, శశాంక్, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్