Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.
MLC Nagababu : అన్నయ్యా.. ఇది నాకెంతో స్పెషల్.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమని బదులిచ్చారు నాగబాబు.
Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. వచ్చే ఏడాదికి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ అనిల్, చిరంజీవి డైలాగ్తో ఎండ్ చేశారు.
Actor Sivaji: 'మంగపతి'తో మెగాస్టార్.. 'కోర్ట్' మూవీకి చిరు ఫిదా!
కోర్టు మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 'మంగపతి' పాత్రలో అదరగొట్టిన శివాజీని స్వయంగా ఇంటికి పిలిచి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శివాజీ తన ఎక్స్ లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్.. డబ్బులు వసూలు చేసిన కేటుగాళ్లు!
చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. చిరంజీవి టూర్ను క్యాష్ చేసుకునే పనిలో కొందరు కేటుగాళ్లు పడ్డారు. ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. అయితే ఇది కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
BIG BREAKING: చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు
మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను ప్రకటించింది. ఈ పురస్కారాన్ని మార్చి 19న ఆ దేశ పార్లమెంటులో చిరంజీవికి అందజేయనున్నారు.
Kiran Bedi: చిరంజీవికి కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. కూతుళ్లు కూడా వారసులే అంటూ!
మగపిల్లలే వారసులని చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూతుళ్లు కూడా వారసురాలేనని నమ్మండి. వారు ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి. ప్రయోజకులై కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లలను చూసి నేర్చుకోండి అన్నారు.
BIG Breaking : కొణిదెల అంజనాదేవికి అస్వస్థత?
కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అమ్మకు బాగాలేకపోవడంతో విజయవాడలో ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకుని హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది.