/rtv/media/media_files/2025/08/27/mana-shankara-varaprasad-garu-movie-2025-08-27-12-30-50.jpg)
Mana Shankara VaraPrasad Garu movie
Mana Shankara VaraPrasad Garu Movie: డైరెక్టర్ అనిల్ రావిపూడి(Director Anil Ravipudi), మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) కాంబోలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుంది. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను ఇటీవల చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా మూవీ టీం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో చిరంజీవి నదిలో పడవపై పట్టు పంచె కట్టుకుని చాలా స్టైల్‌గా కనిపించారు. సూపర్ స్టైల్ లుక్‌లో చిరంజీవి అవుట్‌ఫిట్ అయితే అదిరిపోయింది. అయితే ఈ ఫొటో కేరళలో తీసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల మూవీ షూట్‌ను కేరళలో పూర్తి చేశారు. ఇక్కడ షూట్ చేసిన వాటిలో ఓ ఫొటోతో ఈ పండుగ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కేరళలోని ప్రకృతి అందాలు, బ్యాక్ వాటర్స్ ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు 🤗🙏🏻
— Anil Ravipudi (@AnilRavipudi) August 27, 2025
— మీ “మన శంకర వరప్రసాద్ గారు” ❤️#ManaShankaraVaraPrasadGaru#ChiruAnilpic.twitter.com/XEwJGd2ruw
టైటిల్ టీజర్‌తో ఒక్కసారిగా పెంచేసిన అంచనాలు..
వర్కింగ్ టైటిల్ మెగా 157 ఒరిజినల్ టైటిల్‌ను ఇటీవల చిత్ర యూనిట్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిపి ప్రేక్షకులను అలరిస్తారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్టైల్, గ్రేస్ తోడైతే వెండితెరపై ఒక అద్భుతమైన విందు అని చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో చిరంజీవి పాత్ర ఏంటనే విషయం తెలియదు. దీనిపై మూవీ టీం కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చిరంజీవి, అనిల్ కాంబోలో వస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. గాడ్ ఫాదర్, సైరా నరసింహా రెడ్డి వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి .
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు 😃✨
— Team Megastar (@MegaStaroffl) August 27, 2025
— మీ “మన శంకర వరప్రసాద్ గారు” ❤️#ManaShankaraVaraPrasadGaru#ChiruAnil
Megastar @KChiruTweets@AnilRavipudi@Shine_Screens@GoldBoxEntpic.twitter.com/Dhf2PPZzSp
ఇది కూడా చూడండి: Shrasti Verma in Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ.. ఈసారి మాములుగా ఉండదుగా!