Vishwambhara : విశ్వంభర గ్లింప్స్‌.. గూస్‌బంప్స్ అంతే!

చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.  ఈ రోజు ఆయన బర్త్ డే  సందర్భంగా సినిమా నుంచి గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్.ఈ గ్లింప్స్ లో ఒక బాలుడు, వృద్ధుడి మధ్య జరిగే సంభాషణతో మొదలవుతుంది.

New Update
chiranjeevi

చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ రోజు చిరు బర్త్ డే  సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో ఒక బాలుడు, వృద్ధుడి మధ్య జరిగే సంభాషణతో మొదలవుతుంది. విశ్వంభర ప్రపంచంలో సంభవించిన భయానక సంఘటనల గురించి వారు చర్చిస్తూ కనిపిస్తారు. ఒక వ్యక్తి స్వార్థం వల్ల జరిగిన మహా వినాశనాన్ని వృద్ధుడు వివరిస్తాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో రక్షకుడు ఎట్టకేలకు ఆవిర్భవిస్తాడు. ఆ రక్షకుడిగా చిరంజీవి ఎంట్రీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ గ్లింప్స్‌ చూసిన అభిమానులు నుంచి భారీ స్పందన వస్తుంది. కాగా బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.  ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది. మొదట 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా VFX పనుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం, 2026 సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇది చిరంజీవి కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. 

పురాణాల్లో చెప్పబడిన 14 లోకాలలో అత్యున్నతమైన సత్యలోకం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని దర్శకుడు వశిష్ట  ఇప్పటికే  వెల్లడించారు.  ఈ సినిమా అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) తో రూపొందుతోంది. చిరంజీవి స్వయంగా ఈ సినిమా VFX కోసం ఎక్కువ సమయం తీసుకుంటుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాను రూపొందించడానికి టీమ్ కృషి చేస్తోందని తెలిపారు.

చిరు స్పెషల్ వీడియో

సినిమా ఆలస్యానికి గల కారణాలను ఓ స్పెషల్ వీడియోలో వివరించారు మెగాస్టార్. 'సినిమాలోని సెకండ్ ఆఫ్ అంతా కూడా గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే  ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా అత్యత్తమైన గ్రాఫిక్స్ అందించే ప్రయత్నమే సినిమా ఆలస్యానికి కారణమని చెప్పారు. 'విశ్వంభర' ఒక అందమైన చందమామ కథలా సాగే చిత్రమని, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉండబోతుందని తెలిపారు.  ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 100 మంది డాన్సర్లు, మౌని రాయ్ గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. భీమ్స్‌ మ్యూజిక్ లో చిరు, మౌనిరాయ్‌ థియేటర్‌లో ఫుల్ జోష్ నింపనున్నారు. 

Also Read :  AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..మావోయిస్టుల కోసం ప్రత్యేక కోర్టు

Advertisment
తాజా కథనాలు