Mana ShankaraVaraprasad Garu: 'మన శంకరవరప్రసాద్ గారు'  వచ్చేశారు.. .. మెగాస్టార్ మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరింది!

ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి  'మన శంకరవరప్రసాద్ గారు'  అనే టైటిల్ ను ప్రకటించారు.

New Update

Mana ShankaraVaraprasad Garu:   మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న #Mega157  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  ఈ క్రమంలో ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. #Mega157 మూవీ  ఒరిజినల్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు "మన శంకరవరప్రసాద్ గారు" అనే టైటిల్ ని ఫిక్స్  చేశారు.  చిరంజీవి అసలు పేరుతో ఈ  సినిమా టైటిల్ ఉండడం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. 

గ్లింప్స్  వీడియో.. 

ఈ మేరకు టైటిల్ గ్లింప్స్  వీడియో వీడియోను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ స్టైలిష్ ఎంట్రీ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తోంది. బ్లాక్ సూట్ లో  స్టైల్ గా  కారులో నుంచి దిగి.. సిగరెట్ వెలిగించి తనదైన మార్క్ స్టైల్లో మెగాస్టార్ నడుచుకుంటూ వెళ్తున్న సీన్ గూస్ బంప్స్ తెప్పించింది.  5, 6 మంది గన్మెన్లతో చిరు నడుస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో  "బాస్, బాస్, బాస్" అంటూ  వాయిస్ ఓవర్ అదిరిపోయింది.  అలాగే  చిరంజీవి "రౌడీ అల్లుడు" సినిమాలోని క్లాసిక్ సాంగ్  "లవ్ మీ మై హీరో" మ్యూజిక్ రీమిక్స్ చేసి బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేశారు. ఇది వింటేజ్ మెగాస్టార్ వైబ్స్ కలిగించింది. చివరికి వెంకీ మామ వాయిస్ ఓవర్ తో   "మన శంకరవరప్రసాద్ గారు".. పండగ కి వచ్చేస్తున్నారు అంటూ వెంకీ మామ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ లా అనిపించింది. 

మెగాస్టార్ మాస్ యాక్షన్, స్టైల్, కామెడీ కలయికతో హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా "మన శంకరవరప్రసాద్ గారు" ఉండబోతుందని గ్లిమ్ప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో చిరంజీవి ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

షైన్ స్క్రీన్స్,  గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై  చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల,  సాహు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. గాడ్ ఫాదర్, సైరా నరసింహా రెడ్డి  వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. 

డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు  భారీగా ఉన్నాయి . 

Also Read: HBD MegaStar Chiranjeevi: కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి హీరో చిరునే.. ఏ సినిమాకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు