/rtv/media/media_files/2025/08/22/ysr-chiru-2025-08-22-13-42-32.jpg)
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న చిరంజీవి 2008లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ పార్టీ కేవలం 18 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ప్రజల్లో YSR కు ఉన్న గొప్ప పేరు, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలను గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ కేవలం 92 స్థానాలకు పరిమితమైంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓట్లను చీల్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి విజయం మరింత సులభమైందని రాజకీయ విశ్లేషకులు ఆ సమయంలో అభిప్రాయపడ్డారు.
Also Read : 'మన శంకరవరప్రసాద్ గారు' వచ్చేశారు.. .. మెగాస్టార్ మూవీ టైటిల్ గ్లింప్స్ అదిరింది!
అఖండ విజయం సాధించినా
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ వైఎస్సాఆర్ మాత్రం అంత సంతోషంగా లేరు. ఎందుకంటే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 185 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలైన టీఆర్ఎస్ 26 స్థానాలు, వామపక్షాలు 15 స్థానాలు గెలుచుకున్నాయి. మొదటిసారి వైఎస్సాఆర్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 104 & 108 సేవలు, 60 ఏళ్లు పైబడిన వారికి పింఛన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో 2009 ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు రావడం వైఎస్సాఆర్ ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆయన రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాక ప్రజల వద్దకు వెళ్లి తన పాలనపై, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రచ్చబండ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వైఎస్సాఆర్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఈ రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగానే, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా నల్లమల అడవుల్లో కూలిపోయింది. ఈ దురదృష్టకర ప్రమాదంలో వైఎస్సాఆర్ మరణించారు. వైఎస్సాఆర్ చనిపోయాక ప్రజారాజ్యం పార్టీని 2011లో భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరు. అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. 2012లో ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైన చిరంజీవి, 2014 తర్వాత సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే, ఆయన ఎప్పటికీ తనను తాను రాజకీయాలకు దూరం చేసుకోలేదని, ప్రస్తుతం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
Also Read : HBD Megastar Chiranjeevi: తమ్ముడి పవన్ కళ్యాణ్ కి ప్రేమతో.. వైరలవుతున్న చిరంజీవి లేఖ!