Chiranjeevi: ఆందోని నుంచి హైదరాబాద్ .. మెగాస్టార్ కోసం సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన లేడీ ఫ్యాన్! (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆంద్రప్రదేశ్ లోని ఆందోని నుంచి హైదరాబాద్ వరకు ఆయనను కలవడానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వీరాభిమానిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

New Update
megastar Chiranjeevi

megastar Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆంద్రప్రదేశ్ లోని ఆందోని నుంచి హైదరాబాద్ వరకు ఆయనను కలవడానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వీరాభిమానిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అంతేకాదు ఆమె పిల్లల చదువుకు కావాల్సిన పూర్తి ఆర్ధిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆంద్రప్రదేశ్ లోని ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరీ అనే మహిళ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. దీంతో చిరంజీవి ఎలాగైనా  కలవాలనే కలతో ఆదోని నుంచి హైదరాబాద్ కి సైకిల్ పై తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనప్పటికీ ఆమె వెనుదిరగలేదు. మెగాస్టార్ పై ఆమెకున్న అభిమానమే ఆమెను ముందుకు నడిపించింది. 

అభిమానికి మెగాస్టార్ సహాయం.. 

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమెను  హృదయపూర్వకంగా ఆహ్వానించారు. తనను చేరుకోవడానికి రాజేశ్వరి చేసిన కృషికి మెగాస్టార్ చలించిపోయారు. తన కోసం వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన అభిమానికి తన వంతు సహాయం అందించారు.  భవిష్యత్తులో రాజేశ్వరీ  పిల్లల చదువులకు అవసరమయ్యే  పూర్తి ఆర్ధిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మెగాస్టార్ రాఖీ కట్టగా.. చిరు ఆమెకు ఆశీస్సులు అందించారు. అలాగే ఒక అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు. పిల్లలకు కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. 

చిరంజీవి స్టార్ హీరోగా మాత్రమే ఒక మంచి మనిషిగా కూడా పేరు పొందారు. 1998 లో సమాజ సేవ కోసం 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించారు. ఈ ట్రస్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , చిరంజీవి ఐ బ్యాంక్ అనే రెండు ప్రధాన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి ఉచితంగా రక్తం అందిస్తారు. చిరంజీవి అభిమానులు చాలా మంది ఇక్కడ స్వచ్ఛందంగా రక్తం దానం చేస్తారు. అలా సేకరించిన లక్షల యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి ఉచితంగా అందిస్తారు. అలాగే కంటి సమస్యలతో బాధపడే వారికి చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా కంటి ఆపరేషన్లు, కార్నియా మార్పిడి వంటి సేవలను ఉచితంగా అందిస్తారు.

కరోనా సమయంలో కూడా చిరంజీవి సమాజం పట్ల ఎంతో బాధ్యత వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి, ఎమర్జెన్సీ ఉన్నవారికి ఉచితంగా ఆక్సిజన్‌ను అందించారు. ట్రస్ట్ ద్వారా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా మెగాస్టార్ ఎంతో మందికి తన సహాయాన్ని అందించారు.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక అనిల్ రావీపూడి మన శంకర వరప్రసాద్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత మరో రెండు లైనప్స్ మెగాస్టార్ కోసం సిద్ధంగా ఉన్నాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో మరో సినిమా. ఇటీవలే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ సినిమా అనౌన్స్ చేశారు బాబీ. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది.  

Advertisment
తాజా కథనాలు