/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో14వ రోజుకు చేరింది. గతంలో చెప్పినట్లుగా 30 శాతం వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని కార్మికులు అంటుంటే.. ‘పెంచేదే లే’ అని నిర్మాతలు చెబుతున్నారు. నిర్మాతలు కార్మికుల యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ.. సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు..ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఈ సమస్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది.
ఇది కూడా చదవండి:తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
ఈ తరుణంలో ఈ రోజు సాయంత్రం నిర్మాతల బృందం మరోసారి చిరంజీవిని కలువనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం ఫెడరేషన్ నాయకులతోనూ చిరంజీవి భేటీ కానున్నారు. మంగళవారం రోజు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిరంజీవితో ఇరువర్గాల భేటీ తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరుపక్షాల అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రయత్నం. ఎవరికీ నష్టం రాకుండా సమస్యను పరిష్కరించే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..
కాగా సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరు ఇరువర్గాల సమస్యకు ఎలా పరిష్కారం చేస్తారు…? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు…? అనే విషయం ఆసక్తిగా మారింది.పరిశ్రమకు ఇరువర్గాల అవసరం ఉన్నందున ఇప్పుడు చిరంజీవి అటు నిర్మాతలకు, ఇటు సినీకార్మికులకు ఇబ్బందికలగకుండా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : వీడు వార్డెన్ కాదు వేస్ట్ ఫెలో.. హైదరాబాద్‌లో బయటపడ్డ దారుణం!
కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సమ్మె పరిష్కారం కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు సమ్మెకు పరిష్కారం కనుగోనే విధంగా చిరు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి తెలుసుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త
కాగా, దాసరి నారాయణరావు మృతి తర్వాత టాలీవుడ్ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు అంటూ లేకుండా పోయింది. దాసరి ఉన్న సమయంలో పరిశ్రమలోని అన్ని వర్గాల సమస్యలకు ఆయన పరిష్కారం చూపేవారు. అయితే ఇండస్ట్రీలో సీనియర్ నటుల మధ్య సయోధ్య లేకపోవడంతో పరిశ్రమలో ఎవరికివారే అయ్యారు. గతంలో ఒకసారి చిరంజీవి ముందుండే ప్రయత్నం చేసినప్పటికీ మోహన్ బాబు లాంటి వారు వ్యతిరేకించడంతో ఆయన కూడా వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి తప్ప మరెవ్వరూ టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చే అవకాశం లేకపోవడడంతో ఆయనే సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.
Also Read : ఆ 9 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!