Chhattisgarh: కార్మికుల గోళ్లు తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చి..!
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50వేల సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌ఘఢ్‌లో బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ దంతేవాడ పోలీస్ స్టేషన్లో 26 మంది మావోయిస్టులు సరెండరయ్యారు. వారిలో ముగ్గురిపై రివార్డ్ ఉంది. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారి వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. కొన్నిరోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.
ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ భారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుండి ఈ అవార్డును అందుకున్న మొదటి రచయిత ఆయనే కావడం విశేషం. ఈ అవార్డును అందుకున్న 12వ హిందీ రచయిత కూడా.
ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి కాలుతోపాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
యూపీలోని ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ ను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి.