/rtv/media/media_files/2025/04/27/MUW3aOo4vLwzvRVZjhY6.jpg)
namaz students
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై ఏడుగురు టీచర్లతో సహా ఎనమిది మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిలాస్పూర్ జిల్లాలో జరిగిన ఎన్సీసీ క్యాంప్ టీచర్లు ముస్లిమేతర విద్యార్థులతో కొద్ది రోజులపాటు నమాజ్ చేయించినట్లు తెలుస్తోంది. కోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని శివతారాయ్ గ్రామంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగిన ఎన్‌సిసి శిబిరంలో 159 మంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం చేశారని, వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.
Chhattisgarh News- 8 people including teachers booked for forcing students to offer namaz at NCC camp
— News Arena India (@NewsArenaIndia) April 26, 2025
స్టూడెంట్స్, ప్రజా సంఘాల ఆందోళనతో సంబంధిత టీచర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి బిలాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రజనీష్ సింగ్ నగర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) అక్షయ్ సబ్దారా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు నివేదికను ఎస్‌ఎస్‌పికి సమర్పించిన తర్వాత శనివారం కేసు నమోదు చేశారు
పలు సెక్షన్ల కింద కేసు
గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉపాధ్యాయులుగా ఉన్న దిలీప్ ఝా, మధులికా సింగ్, జ్యోతి వర్మ, నీరజ్ కుమారి, ప్రశాంత్ వైష్ణవ్, సూర్యభాన్ సింగ్, బసంత్ కుమార్ టీమ్ కోర్ లీడర్-కమ్-స్టూడెంట్ ఆయుష్మాన్ చౌదరిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు (196 (196) (196,1) (196,1), ఛత్తీస్‌గఢ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును కోని పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కోసం కేసు డైరీని కోటా పోలీస్ స్టేషన్‌కు పంపామని ఆయన తెలిపారు.