/rtv/media/media_files/2025/04/22/fKyPT7BBix5461Corp8i.jpg)
ధులు రామ్ పది మందిని మహిళలను వివాహం చేసుకున్నాడు. ఏ భార్య తనతో ఉండలేదు. పెళ్లైన కొన్నిరోజులకే అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. కానీ పదో సారి పెళ్లి చేసుకున్న మహిళను భర్త ధులు రామ్ హత్య చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా చంపాడు. సులేసా గ్రామంలో నాలా దగ్గరున్న ఆదివారం ఓ గొయ్యిలో దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్‌బాడీ అదే గ్రామానికి చెందిన బసంతిగా బాయిదిగా గుర్తించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసుల విచారణలో ఆమె చివరిసారిగా తన భర్తతో కనిపించిందని కూడా తెలిసింది.
Person in centre is Dhula Ram, who made 9 #love marriages. Owing to his cruel behavior, none stayed with him for 6 months. A resident of Jashpur in Chhattisgarh, he killed his 10th wife, was arrested & sent to jail @santwana99 @NewIndianXpress @jayanthjacob #marriage pic.twitter.com/TU37mw4bFQ
— Ejaz Kaiser (@KaiserEjaz) April 22, 2025
Also read; BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు
ఆ అనుమానంతోనే హత్య..
నిందితుడిని ధులు రామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. రామ్ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనికి గతంలో 9సార్లు పెళ్లి అయ్యిందట. ఏదో కారణం చేత వారంత అతన్ని వదిలేసి వెళ్లారు. దీంతో బసంతి కూడా అతన్ని వదిలేసి వెదిలేసి వెళ్లిపోతుందేమో అని అనుమానం అతనికి వచ్చింది. పదే పదే అదే ఆలోచనతో రామ్‌కు 10వ భార్య బసంతిపై ఆందోళన ఎక్కువైంది. భార్య వదిలేసే కంటే ముందే ఆమెను హత్య చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు. మద్యమత్తులో బాక్సైట్ రాయితో భార్య తలపై కొట్టి చంపాడు. నేరాన్ని ఒప్పుకున్న రామ్‌ను అరెస్ట్ చేశారు. బసంతి మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదని పోలీసులు తెలిపారు.
Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్
(Chhattisgarh Jashpur district | Husband Ki*ll*s Wife | husband-killed-wife | husband-killed-his-wife | chhattisgarh | crime news | latest-telugu-news | tenth wife)