AP Election: ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా!
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
లోక్‌సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
AP: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వాలంటీర్లు పార్టీలకు ప్రచారం చేయొద్దని ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి బాండ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://www.eci.gov.in/candidate-politicalparty లో ఉంచినట్లు తెలిపింది.
ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది ఈసీ. ఏప్రిల్ 13న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ భేటీ కానుంది.