/rtv/media/media_files/2025/08/11/rahul-gandhi-detained-2025-08-11-16-23-20.jpg)
ఓట్ల చోరీ ఆరోపణలపై దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో విపక్షాల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. 'ఇండియా' కూటమి(India Alliance) కి చెందిన 300 మందికి పైగా ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు MPలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గందరగోళం మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది.
Also Read : చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
Rahul Gandhi Arrest
आज जब हम चुनाव आयोग से मिलने जा रहे थे, INDIA गठबंधन के सभी सांसदों को रोका गया और हिरासत में ले लिया गया।
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2025
वोट चोरी की सच्चाई अब देश के सामने है।
यह लड़ाई राजनीतिक नहीं - यह लोकतंत्र, संविधान और ‘एक व्यक्ति, एक वोट’ के अधिकार की रक्षा की लड़ाई है।
एकजुट विपक्ष और देश का हर… pic.twitter.com/SutmUirCP8
బిహార్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని, ఇది "ఓట్ల చోరీ" అని ఆరోపిస్తూ 'ఇండియా' కూటమి నిరసనకు దిగింది. పార్లమెంటు బయట జాతీయ గీతం ఆలపించిన తర్వాత, నేతలు ర్యాలీగా బయలుదేరారు. అయితే, ముందుగా అనుమతి తీసుకోలేదన్న కారణంతో పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో నేతలు బారికేడ్లను అధిగమించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బారికేడ్లు దూకారు.
పోలీసులకు, ఎంపీలకు మధ్య జరిగిన తోపులాటలో, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, మితాలి బాగ్ స్పృహ తప్పి పడిపోయారు. తోటి నేతలు వారికి నీళ్లు ఇచ్చి ప్రథమ చికిత్స అందించారు. మితాలి బాగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గేతో సహా అనేక మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగాన్ని కాపాడే పోరాటం. ఇది 'ఒక మనిషి-ఒక ఓటు' హక్కు కోసం జరుగుతున్న పోరాటం. మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి" అని ఆయన డిమాండ్ చేశారు. అటు మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీని "పిరికి నియంతృత్వం" అని విమర్శించారు. అయితే, బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. ఎన్నికల సంఘం కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉంది.
Also Read : మొన్న కుక్కకి, నిన్న ట్రంప్‌కు, ఈరోజు పిల్లికి.. అసలు బిహార్‌లో ఏం జరుగుతోంది?
Rahul Gandhi detained | latest-telugu-news | priyanka-gandhi | mahua-moitra | vote chori protest | central-election-commission | telugu-news | national news in Telugu | political news in telugu