Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఢీ.. 15 మందికిపైగా!
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.