/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు అంతులేకుండా పోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. పదుల్లో జనాలు చచ్చిపోతున్నారు. సేఫ్టీ రూల్స్ పట్టించుకోకపోవడం, మితి మీరిన వేగాలు ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి.
ఆంధ్రాలో రోడ్డు ప్రమాదం
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. రాయల్పాడు దగ్గరలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రవైట్ బస్సులు ఢీకున్నాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఇది కాక మరో నలభైమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: PAK: హైజాక్ నుంచి 80మందిని రక్షించిన పాక్ ఆర్మీ..13 మంది ఉగ్రవాదులు హతం