Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు!

నేపాల్‌ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్‌ కు తీసుకురావడానికి ఎయిర్‌ ఫోర్స్‌ విమానం నేపాల్‌ కు బయల్దేరింది.

New Update
Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు!

Nepal Bus Accident: నేపాల్‌ లో శుక్రవారం బస్సు నదిలోకి దూసుకెళ్లి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరుకుంది. యూపీలోని గోరఖ్‌పూర్‌ కు చెందిన పర్యాటక బస్సులో డ్రైవర్‌, ఇద్దరు సహాయకులు సహా 43 మంది నేపాల్ లోని పొఖారా నుంచి ఖాట్మాండుకు బయల్దేరారు.

తనహు జిల్లాలోని అంబూ ఖైరేని ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కన 150 అడుగుల లతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు.

మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్‌ కు తీసుకురావానికి ఎయిర్‌ ఫోర్స్‌ విమానం నేపాల్‌ కు బయల్దేరింది.

Also Read: గుడ్‌ బై..గబ్బర్‌ షాకింగ్‌ నిర్ణయం

Advertisment
తాజా కథనాలు