TGRTC: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సులు దగ్ధం

హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

New Update
bus fire

bus fire

హైదరాబాద్ కుషాయిగూడ (Kushaiguda) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కుషాయిగూడ బస్ డిపోలో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కాలి బూడిదయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.  మంటల్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అదుపులోకి రాకపోవటంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

Also Read: Kamareddy-Chhaava Movie: కామారెడ్డి లో విద్యార్థుల కోసం ఛావా సినిమా ప్రత్యేక షో!

అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు ఎలా వ్యాపించాయి..? జరిగిన ఆస్తినష్టంపై ఆర్టీసీ అధికారులు నేడు విచారణ జరపనున్నారు.

Also Read: Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Kushaiguda Fire Accident

కాగా, ఈనెల ఈ నెల ప్రారంభంలోనూ హైదరాబాద్ (Hyderabad) మదీనాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాస్ టవర్స్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అక్కడ దాదాపు 200 వరకు వస్త్ర దుకాణాలు ఉన్నాయి. అబ్బాస్ టవర్స్ ఫోర్త్ ఫ్లోర్‌లోని ఓ దుకాణంలో ప్రారంభమైన మంటలు.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. 

షాపుల్లో దుస్తులు, బెడ్ షీట్లు, కార్పెట్లు వంటి ఉండటం వల్ల మంటలు వేగంగా పక్క షాపులకు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు.

గత వారం క్రితం హైదరాబాద్‌ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టిప్పుఖాన్ వంతెన సమీపంలో రన్నింగ్‌లో ఉన్న కారు మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ.. కారు నడుపుతున్న వ్యక్తి అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవర్ కారు నుండి బయటకు దిగేశాడు. 

అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇలా వరుస అగ్ని ప్రమాద ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రానున్నది ఎండా కాలం కావటంతో అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న!

Also Read: Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు