Accident : ఘోర ప్రమాదం.. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!
చత్తీస్ గఢ్ లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు.