/rtv/media/media_files/2025/10/25/fire-accident-2025-10-25-07-04-01.jpg)
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం 19 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున 03 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో మొత్తం 19 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. చూస్తు్ండగానే బస్సు మొత్తం కాలిపోయి శవాల దిబ్బగా మారిపోయింది. ఈ బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 19 మంది మృతి చెందగా మిగిలిన వారు గాయలతో బయటపడ్డారు.
మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన కడారి అశోక్ (27) బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. దీపావళి పండగకు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు కావేరి బస్సు ఎక్కారు. అయితే బస్సులో జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన అశోక్ బస్సు అద్దాలు పగులగొట్టాడు. అందులో నుంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఇక మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి లక్డీకాపూల్‌లో అతను బస్సు ఎక్కాల్సి ఉంది. తరుణ్ U-2 అనే సీట్ రిజర్వ్ చేసుకున్నాడు. శంషాబాద్‌లో పని ఉందని చెప్పి మరో బస్సులో వస్తానని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో తర్వాత వేరే బస్సులో వెళ్లాడు. బస్సు టిక్కెట్ డబ్బులు పోతే పోయాయి గాని ప్రాణాలు దక్కాయని తరుణ్ అంటున్నాడు.
తల్లి- కుమార్తె ఇద్దరూ మృతి
ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి- కుమార్తె ఇద్దరూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మెదక్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి ఆమె కూతురు చందన మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సంధ్యారాణి - వేణు దంపతులకు ఒక కుమార్తె చందన, కుమారుడు వల్లబ్ ఉన్నారు. చందన బెంగళూరులో జాబ్ చేస్తుండగా.. కుమారుడు వల్లబ్ అలహాబాద్ చదువుకుంటున్నాడు. వేణు- సంధ్యారాణి దంపతులు హైదరాబాద్ లో స్థిరపడి.. ప్రస్తుతం దుబాయిలో ఉంటున్నారు.
Follow Us