Kurnool Bus Accident: బస్సును ఢీకొట్టిన బైక్ డ్రైవర్ మృతి

శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులతో పాటూ బైక్ డ్రైవర్ కూడా మృతి చెందారు. 

New Update
bus

బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో యాక్సిడెంట్‌కు గరైంది. బస్సును ఓ బైకును ఢీకొట్టడంతో.. ముందు భాగానికి మంటలు అంటుకున్నాయి. తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. 
అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడగా.. 20 మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం. మొత్తం అంతా మూడు నిమిషాల్లో జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

బైక్‌ను లాక్కెళ్ళిన బస్సు..

ఇక బస్సులో ఉన్నవారితో పాటూ దానిని ఢీకొట్టిన బైక్ డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. బైక్‌ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. దీంతో బైక్‌ను నడుపుతున్న వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయారు. మృతుడు కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శంకర్‌గా నిర్ధారించారు.

Also Read: Trump VS Putin: ఆరు నెలలు వెయిట్ చేయండి నా తడాఖా ఏంటో చూపిస్తా..పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు