Building Collapse: కుప్పకూలిపోయిన భవనం.. నలుగురు మృతి
ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా పదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.