HYD: హైదరాబాద్ యూనివర్శిటీ ఘోర ప్రమాదం..కుప్పకూలిన నిర్మాణం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది. ఇందులో అక్కడ పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

New Update
hyd

building collapsed In HCU

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పెద్ద ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్‌ భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. భవనం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో..అందులో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో ఒక్కసారిగా కార్మికులు భయాందోళనకు గురైయ్యారు. 

ఒకరికి తీవ్ర గాయాలు..

భవనం కూలిపోవడంతో తోటి కార్మికులు, యూనివర్శిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. గాయపడిన కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు విశేషంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు.  గాయపడిన కార్మికుని పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉడొచ్చనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. యూనివర్సిటీ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాంతో పాటూ నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలడానికి గల కారణాలను యూనివర్శిటీ అధికారులు విచారిస్తున్నారు. భవన నిర్మాణం నాణ్యత సరిగ్గా లేదా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ

Advertisment
తాజా కథనాలు