Ashwini Vaishnav: BSF జవాన్లకు అవమానం.. అధికారులను సస్పెండ్ చేసిన రైల్వే మంత్రి
BSF జవాన్లకు శిథిలావస్థలో మురికిగా ఉన్న రైల్వే కోచ్‌ని కేటాయించిన ఘటనపై నలుగురు రైల్వే అధికారులపై వేటు పడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వారిపై యాక్షన్ తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.