Pakistan Returns BSF jawan: BSF జవాన్ రిలీజ్

ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను భారత్‌కు అప్పగించింది. అమృత్‌సర్‌లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను అప్పగించారు. 

New Update
BSF Constable

Pakistan Returns BSF jawan

Pakistan Returns BSF Jawan: ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్(Pakistan Rangers) అదుపులో ఉన్న BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను(BSF Constable Poornam Kumar Shah) భారత్‌కు(India) అప్పగించింది. అమృత్‌సర్‌లోని(Amritsar) అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్(Joint Check Post in Attari) వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను(BSF Constable) అప్పగించారు. దాదాపు 20 రోజుల తర్వాత పూర్ణమ్‌ను పాక్ రేంజర్స్ విడుదల చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

ఇరు దేశాల భద్రతా దళాలు..

BSF 182వ బెటాలియన్ జవాను అయిన పూర్ణమ్ పంజాబ్‌లోని ఫరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత ఏప్రిల్ 23వ తేదీన పూర్ణమ్ అస్వస్థతతకు గురయ్యారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఓ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. అయితే అది భారత్ భూభాగం కాదు.. పాక్‌ది. దీంతో పాకిస్తాన్ రేంజర్స్ పూర్ణమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పూర్ణమ్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. బీఎస్‌ఎఫ్ జవాను రిలీజ్ కావడానికి ఇరు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. 

ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు