/rtv/media/media_files/2025/05/01/P5ScLdOtLJ2Y3ukK6D9o.jpg)
Pakistan delays release of Indian soldier
Pakistan: బార్డర్ దాటిన భారత జవాన్‌ను బంధించిన పాక్ అతని విడుదల అంశంలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ 182 బెటాలియన్‌కు చెందిన పీకే సాహును విడిపించేందుకు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే రేపు, మాపు అంటూ వారం రోజులుగా పాక్ కావాలనే సాగదీస్తోందని, ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు రాలేదని సాకులు చెబుతోందంటూ భారత సైన్యం మండిపడుతోంది.
The pregnant wife of PK Shaw the BSF jawan who was detained by Pakistan Rangers on 23rd April, has visited Pathankot with a plea to BSF officers to ensure his safe return.
— Arpita 🇮🇳 (@arpita_dg) May 1, 2025
Why are Nationalists 24X7 tweeting to teach a lesson to Pak silent on this? #ReleasePKShaw pic.twitter.com/dpGuNS9Hfb
చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ..
ఈ మేరకు పాక్ రేంజర్లతో జరిగిన సమావేశం గురించి మీడియాతో మాట్లాడిన బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి..‘ప్రతిరోజూ మేము వారితో చర్చలు జరుపుతున్నాం. చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అధికారుల నుంచి పర్మిషన్ రాలేదంటున్నారు. మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీలైనంత త్వరగా సాహును విడిపించి తీసుకొస్తాం' అని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పంజాబ్ ఫిరోజ్‌పుర్ వద్ద సాహు అనుకోకుండా సరిహద్దు దాటాడు. 2 మీటర్లవరకు పాక్ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో వెంటనే పాక్ బలగాలు అదుపులోకి తీసుకొని బంధించాయి. మరోవైపు భారత్ యుద్ధానికి సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాకి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అయితే మోదీ ప్రకటన చేసిన కొంతసేపటిలోనే పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ తన ఎక్స్ ఖాతాలు యుద్ధానికి సంబంధించి పోస్ట్ చేశారు. భారత్ రానున్న రెండు, మూడు రోజుల్లో పాకిస్తాన్ పై దండెత్తబోతోందని, తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది.
ఇది కూడా చదవండి: రోజూ గంట నడిస్తే ఎన్ని కిలోల బరువు తగ్గవచ్చు?
BSF Jawan | today telugu news