/rtv/media/media_files/2025/05/15/Z8hjM55spHLqyzJnHIyN.jpg)
Pakistan army 21 days tortured india BSF jawan
BSF jawan: భారత BSF జవాన్‌ను బంధించిన పాక్ అతనినుంచి రక్షణ రహస్యాలు రాబట్టేందుకు చాలా టార్చర్ చేసినట్లు బయటపడింది. 21 రోజులు వారి నిర్భందంలో ఉన్న జవాన్ పూర్ణమ్ కుమార్ షా.. ఇటీవల విడుదలయ్యారు. అయితే బంధీగా ఉన్న సమయంలో షాను నిద్ర పోనివ్వలేదట. అంతేకాదు మొహం కూడా కడుక్కోకుండా అడ్డుకుని వేధింపులకు గురిచేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
India has also handed over a Pakistani Rangers personnel who had strayed into Rajasthan https://t.co/2kZALOrsNR
— Bharti Jain (@bhartijainTOI) May 14, 2025
Also Read : సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!
3 ప్రాంతాల్లో తిప్పి తిప్పి..
అనుకోకుండా పట్టుబడిన పూర్ణమ్‌ను 3 ప్రాంతాల్లో తిప్పి చివరికి ఒక జైలులో వేశారు. ఎక్కువ సమయం కళ్లకు గంతలు కట్టే ఉంచారని అధికారులు వెల్లడించారు. శారీరకంగా ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు కానీ.. మానసికంగా టార్చర్ చేశారన్నారు. నిద్ర కూడా సరిగా పోనివ్వలేదు. ఉదయం మోహం కడుక్కోనివ్వలేదు. సరిహద్దులో సెక్యూరిటీ, సీనియర్ అధికారుల వివరాలు చెప్పాలని ఒత్తిడి చేశారు. పూర్ణమ్ దగ్గర ఫోన్ లేకపోవడంతో ఎలాంటి సమాచారం లీక్ కాలేదని వివరించారు.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
ఎలా దొరికాడంటే..
పంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో రైతులకు రక్షణగా ఏప్రిల్ 23న పూర్ణమ్ గస్తీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలోనే తీవ్ర ఎండ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అది పాక్ భూభాగమని గుర్తించలేదు. పాక్ రేంజర్స్ వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గర్భంతో ఉన్న పూర్ణమ్ భార్య.. అతని విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. అయితే పాక్ అధికారులు పట్టించుకోలేదు. కానీ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో పాక్ రేంజర్ బీఎస్‌ఎఫ్ అదుపులోకి తీసుకోవడంతో ఇద్దరినీ విడుదల చేశారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
Also Read : UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే
telugu-news | today telugu news