BSF jawan : మీ బుద్ది మారలేదు కదరా.. BSF జవాన్ ను అడ్డం పెట్టుకుని పాక్ ఆర్మీ దొంగదెబ్బ!

ఏప్రిల్ 23న పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ జవాన్ ను కవచంగా ఉపయోగించుకోవాలని పాక్ చూస్తుందని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. 

New Update
bsf-jawan

bsf-jawan

ఏప్రిల్ 23న పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ విడుదల చేసిన కళ్లకు గంతలు కట్టిన పూర్ణం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడిని పాక్ ఆర్మీ సైన్యం అదుపులోకి తీసుకుని ఇప్పటికి ఆరు రోజులైంది. ఇంతవరకు అతని గురించి పాక్ ఆర్మీ ఎటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పటికీ పాకిస్తాన్ రేంజర్స్‌తో బిఎస్‌ఎఫ్  అధికారులు నాలుగు ఫ్లాగ్ సమావేశాలు నిర్వహించినప్పటికీ పూర్ణం కుమార్ షాను విడుదల చేయడానికి పాకిస్తాన్ అంగీకరించలేదు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యద్ధం చేయాల్సి వస్తే ఈ జవాన్ ను  కవచంగా ఉపయోగించుకోవాలని పాక్ చూస్తుందని ఇండియన్ ఆర్మీ అనుమానిస్తోంది. యుద్దమంటే నేరుగా చేయాలి కానీ ఇలా పిరికిపంద లాగా దొంగ ప్రయత్నాలు చేయడం ఏంటి..  ఇప్పటికే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో కూడా ఉగ్రవాదులు ఆర్మీ డ్రెసుల్లోనే వచ్చి కాల్పులకు  పాల్పడ్డారు. 

మరోవైపు బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ సాహు భార్య సోమవారం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకుంది. సాహు భార్య రజని గర్భవతి, ఆమె కుమారుడు, బంధువులతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు.  తన భర్తను తిరిగి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి సీనియర్ బిఎస్ఎఫ్ అధికారుల నుండి సమాచారం సేకరించడానికి రజని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు వెళ్లనున్నారు. రజని చివరిగా మంగళవారం తన భర్త పూర్ణంతో మాట్లాడారు. పూర్ణం తల్లి దేవంతి దేవి కూడా తన బాధను వ్యక్తం చేస్తూ, "నా కొడుకు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అతని నుండి నాకు  సమాచారం అంది చాలా సమయం అయింది" అని దేవంతి అన్నారు.

రైతులకు భద్రత కల్పిస్తూ

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీకి చెందిన పూర్ణం కుమార్ షా (40) బుధవారం రైతులకు భద్రత కల్పిస్తూ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును ప్రమాదవశాత్తు దాటడంతో పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బంధువుల ప్రకారం పూర్ణం కుమార్ షా  దంపతుల రెండవ బిడ్డతో గర్భవతి. ఈ దంపతులకు ఏడేళ్ల పాప ఉంది. అతను 17 సంవత్సరాలుగా దేశానికి సేవ చేస్తున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు