Andhra Pradesh: పడవ బోల్తా పడి గోదావరిలో ఆరుగురు గల్లంతు.. చివరికి
డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. స్థానికులు మరో పడవలో చేజింగ్ చేసి ఐదుగురిని సురక్షితంగా రక్షించగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు.