Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి.. 12 కేసులతో జైలుకు వెళ్లిన పింటూ మహారా బెయిల్‌పై బయటకు వచ్చాడు. కుంభమేళాలో పడవలు నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు. పింటూ మహారా ప్రయాగ్‌రాజ్‌లో 130 పడవలు నడిపి 300 మందికి ఉపాధి కూడా కల్పించాడు.

New Update
Pintu Mahara

Pintu Mahara Photograph: (Pintu Mahara)

జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన పింటూ మహారాకు కుంభమేళాలో జాక్‌పాట్ తగిలింది. పింటూకి బాషా సినిమాలో లాగా పెద్ద క్రిమినల్ ఫ్లాష్‌బ్యాకే ఉంది. ఆ సినిమాలో రజినీ కాంత్ ఆటో మణిక్యంపై పేరు తెచ్చకుంటే.. ఇక్కడ మన రియల్ హీరో పడవ పింటూ భాయ్‌‌గా వైరల్ అవుతున్నాడు. అతనిపైన మర్డర్, బ్లాక్‌మెయిల్, దోపిడీ సహా మొత్తం 12 కేసులు ఉన్నాయి. పింటూ తండ్రి కూడా అనేక కేసులతో జైలుకెళ్లి జైల్లోనే చనిపోయాడు. పింటూ సోదరుడు కూడా రౌడీ షీటరే. అతని కుటుంబం మొత్తానికి నేరచరిత్ర ఉంది.

అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చాడు. 45 రోజులు బుద్ధిగా ఉండి ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కష్టపడి పని చేసుకున్నాడు. కుంభమేళాలో ఏకంగా రూ.30 కోట్లు సంపాదించాడు. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో ఇటీవల 45 రోజులపాటు కుంబమేళా కొనసాగింది. పడవల యజమాని అయిన పింటూ మహరా ఈ కుంభమేళాలో చాలా మంది ప్రయాణీకులను గమ్యాలకు చేర్చి రూ.30 కోట్లు సంపాధించాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ స్వయంగా అసెంబ్లీలో వెల్లడించాడు. పింటూని విన్నర్ అని అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం మెచ్చకున్నారు. 

Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

2019లో జరిగిన అర్ధకుంభమేళాలో అతని దగ్గరున్న పడవలు సరిపోలేదట. దాంతో మహాకుంభమేళాకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి, ఖర్చుకు మించిన ఆదాయం తప్పకుండా వస్తుందనే ధైర్యంతో పడవలను భారీగా పెంచుకున్నాడట. అతని దగ్గర 60 పడవలు మాత్రమే ఉండేవి.. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా రద్దీ ఊహించి మరో 70 పడవలు కొన్నాడు. అందుకు తన దగ్గర డబ్బులు లేకున్నా అప్ప చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. పెట్టిన డబ్బులకు పింటూ మహారా డబుల్ త్రిబుల్ సంపాధించాడు. జైలు నుంచి వచ్చి క్రిమినల్ బాగ్రౌండ్ పక్కన పెట్టిన కష్టపడి పని చేశాడు.  రిస్క్ తీసుకొని కష్టపడ్డాడు అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది. 130 పడవలతో అతను 45 రోజుల్లోనే రూ.30 కోట్లు సంపాధించాడు. డేర్ చేసి ఉన్నదంతా ఊడ్చి, అప్పులు చేసి 70 పడవలు కొన్నాడని పింటూ తల్లి చెప్పింది. ఈ కుంభమేళా సందర్భంగా పింటూ భారీగా సంపాదించుకోవడమే కాదు.. మొత్తం 300 మంది యువతకు ఉపాధి కల్పించాడు. 

Advertisment
తాజా కథనాలు