Kumbh Mela: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

కుంభమేళాలో పడవలు నడిపి పింటూ మహారా అనే వ్యక్తి రూ.30 కోట్లు సంపాధించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంపాధించిన రూ.30 కోట్లలో 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. దీంతో పింటూ ఫ్యామిలీ షాక్ అయ్యింది.

New Update
pintu boat business

pintu boat business Photograph: (pintu boat business)

మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దిశ మారిపోయింది. ప్రయాగ్‌రాజ్ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన కోట్ల మంది భక్తల కారణంగా ఆ రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. బోట్లు నడిపే ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిన విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని డబ్బుల వచ్చాయంటే ఐటీ అధికారులు ఖాళీగా ఉంటారా ఇగ.

ఆ కుటుంబానికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ శాఖ షాక్‌ ఇచ్చింది. రూ.30 కోట్లు సంపాధించుకున్నందుకు.. 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పింటూ మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. మహా కుంభమేళా జరిగిన 45 రోజులు త్రివేణీ సంగమానికి పడవలు నడిపిన ఈ కుటుంబం దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది.

Also read: Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

ఐటీ అధికారులు పింటూ సంపాదన గురించి తెలుసుకుని ఐటీ చట్టంలోని 4, 68 సెక్షన్ల కింద రూ.12.8 కోట్ల పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో పింటూ కుటుంబం మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. ఈ విషయంలో సెబీ రిసెర్చ్‌ అనలిస్ట్‌ ఏకే మంధన్‌ ఎక్స్‌ వేదికగా ఐటీ అధికారులను ప్రశ్నించారు. ఐటీ శ్లాబ్‌లు, నిబంధనల గురించి ఏమీ తెలియని పింటూ సంపాదించిన సొమ్ములో ఖర్చులు పోను ఇక మిగుల్చుకున్నదేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పింటూకు వచ్చిన పబ్లిసిటీనే అతని పాలిట శాపంగా మారింది. కుంభమేళాకు ముందు పింటూ దగ్గర 60 బోట్లు మాత్రమే ఉండేవి. ప్రయాగ్‌రాజ్ రద్దీని అంచనా వేసి 70 బోట్లు అప్పు చేసి కొన్నాడు. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. 

Advertisment
తాజా కథనాలు